Home  »  Bollywood News  »  సమంత భర్తతో సల్మాన్ ఖాన్ సూపర్ హీరో మూవీ.. మేటర్ లీక్ చేసిన సామ్!

Updated : Jun 17, 2026

బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ (Salman Khan) తన కెరీర్ రూట్ మార్చారు. వరుసగా ఎదురవుతున్న పరాజయాల నేపథ్యంలో రొటీన్ యాక్షన్, మాస్ ఎలివేషన్స్ ఉన్న కథలకు భిన్నంగా సరికొత్త సబ్జెక్టులను ఎంచుకుంటూ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగు వ్యక్తి, గల్వాన్ లోయ ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'మాతృభూమి' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆర్మీ కల్నల్‌గా సల్మాన్ ఖాన్ కనిపించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఒక వైపు ఈ సినిమా ముగుస్తుండగానే, సైలెంట్‌గా మరికొన్ని భారీ ప్రాజెక్టులకు సల్లూభాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు.

సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రాల విషయంలో ఎక్కడా గ్యాప్ రాకుండా పక్కా ప్లానింగ్‌తో స్పీడ్ పెంచారు. ఇప్పటికే టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్లో పెట్టినట్లు బాలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో బలమైన ప్రచారం సాగుతోంది. బాలీవుడ్‌లో వినూత్న వెబ్ సిరీస్‌లు, సినిమాలతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న క్రేజీ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే (రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే)తో సల్మాన్ ఖాన్ జతకట్టబోతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది.

రాజ్ అండ్ డీకే ఇటీవల సల్మాన్ ఖాన్ కోసం ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారట. కండల వీరుడి ఇమేజ్‌కు సరిపోయేలా వినోదభరితమైన ఎలిమెంట్స్‌తో కూడిన ఒక డిఫరెంట్ సూపర్ హీరో కథను వారు డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. 'కామెడీ విత్ సూపర్ హీరో' జోనర్‌లో సాగే ఈ కథాంశం సల్మాన్‌కు ఎంతగానో నచ్చడంతో ఆయన వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారని సమాచారం. సాధారణంగా సూపర్ హీరో సినిమాలు సీరియస్‌గా సాగుతాయి, కానీ రాజ్ అండ్ డీకే మార్క్ కామెడీ టైమింగ్ ఈ కథలో తోడవడంతో సల్మాన్ చాలా ఇంప్రెస్ అయ్యారట.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు రాజ్ ఈ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇస్తూనే, వివరాలను గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. హిందీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కబోతోందని, స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని చెప్పారు కానీ హీరో ఎవరనేది అధికారికంగా రివీల్ చేయలేదు. అయితే ఇన్ స్టాగ్రామ్‌లో ఒక ప్రముఖ సినిమా పేజీ ఈ ప్రాజెక్ట్ గురించి రాసిన పోస్టుకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు లైక్ కొట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. 

రాజ్ అండ్ డీకే ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరు మరెవరో కాదు.. సమంత భర్తనే. అందుకే సల్మాన్ ఖాన్ సూపర్ హీరో సినిమా పోస్టును సమంత లైక్ చేయడంతో ఈ క్రేజీ కాంబినేషన్ నిజమేనంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ భారీ సూపర్ హీరో చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఒకవేళ సమంత కనుక ఈ ప్రాజెక్టులో భాగమైతే సల్మాన్ ఖాన్, రాజ్ అండ్ డీకే, సమంతల కాంబో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.